Charles III: ఆసుపత్రిలో చేరిన కింగ్ చార్లెస్-3 5 d ago

బ్రిటన్ కింగ్ చార్లెస్-3 లండన్ లోని ఆసుపత్రిలో చేరారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చార్లెస్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది.. చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చార్లెస్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కింగ్ చార్లెస్ వయసు 76 సంవత్సరాలు. ఆయన ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 చనిపోయిన తర్వాత బ్రిటన్ కింగ్ గా అవతరించిన ఛార్లెస్ కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్దాణ అయ్యింది.